: బాబర్-2 క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన పాక్.. భారతే లక్ష్యం.. చైనా సహకారం!


భారత్ లక్ష్యంగా చైనా సహకారంతో నిర్మించిన బాబర్-2 క్రూయిజ్ మిసైల్‌ను పాకిస్థాన్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. భూతలంలోని లక్ష్యాలతోపాటు సముద్రం మీది లక్ష్యాలను కూడా ఛేదించగల సామర్థ్యం ఉన్న ఈ క్షిపణి వార్‌హెడ్లను కూడా మోసుకెళ్లగలదు. ‘బాబర్-2’తో పాక్ రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని పాక్ సైన్యాధికారులు పేర్కొన్నారు. క్షిపణి పరీక్ష విజయవంతం కావడంపై పాక్ ప్రధాని, అధ్యక్షుడు శాస్త్రవేత్తలను అభినందించారు. కాగా బాబర్-2 పరిధిలోకి భారత్‌లోని ఢిల్లీ, చండీగఢ్ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలు వస్తున్నాయి. బాబర్-2 పరీక్ష సక్సెస్ ద్వారా ఉత్తర భారతదేశాన్ని పాక్ తన గుప్పిట్లోకి తీసుకుందని నిపుణులు చెబుతున్నారు. ‘బాబర్-2’ను విజయవంతంగా ప్రయోగించడంలో చైనా సహకారం ఎంతో ఉందని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News