: చైతూ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాను: పుట్టినరోజున రానా ప్రకటన
సాధారణంగా పుట్టిన రోజు జరుపుకుంటున్న వారికి అందరూ బహుమతులు ఇస్తుంటారు. అందుకు భిన్నంగా టాలీవుడ్ కండల వీరుడు రానా దగ్గుబాటి తన పుట్టినరోజున తన బావమరిది నాగచైతన్యకు పెద్ద బహుమతి ప్రకటించాడు. చైతూ హీరోగా తాను నిర్మాతగా సినిమా తీయనున్నానని తెలిపాడు. ఈ సినిమాకు మరిముత్తు దర్శకుడిగా వ్యవహరించనున్నాడని తెలిపాడు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని తెలిపాడు. చైతూతో కలిసి పనిచేయడం గర్వంగా ఉందని పేర్కొన్నాడు. చూస్తుంటే ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా సమంత నటించే అవకాశం కనిపిస్తోంది. కాగా, రానా, చైతు బావా, బావమరుదులే కాకుండా మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే.