: ధోనీతో శత్రుత్వం లేదు.. తను మంచి ఆటగాడు!: గంభీర్


పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో తనకు శత్రుత్వం లేదని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తెలిపాడు. ఫేస్ బుక్ లో అభిమానులతో నిర్వహించిన లైవ్ ఛాట్ లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. దేశం కోసం ఆడుతున్నప్పుడు ఎలాంటి విభేదాలున్నా పక్కన పెట్టి ఆడాల్సిందేనని అన్నాడు. తమ లక్ష్యం జట్టు గెలుపేనని గంభీర్ స్పష్టం చేశాడు. ధోనీతో తనకు అభిప్రాయభేదాలు ఉండేవని తెలిపాడు. ఒక కుటుంబంలో అయినా, గ్రూప్ లో అయినా అభిప్రాయభేదాలు ఉంటాయని గంభీర్ చెప్పాడు. తమ మధ్య కూడా అలాంటివే ఉండేవని తెలిపాడు. తన వరకు ధోనీ మంచి ఆటగాడు, అద్భుతమైన మనిషి అని తెలిపాడు. 2011 వరల్డ్ కప్, 2007 టీ20 వరల్డ్ కప్ ను గెలుచుకోవడమే తన జీవితంలో మరుపురాని అనుభూతులని అన్నాడు. 

  • Loading...

More Telugu News