: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ బాడీగార్డ్ దుర్మరణం


బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ బాడీగార్డ్ మనోజ్ శర్మ రైలు ప్రమాదంలో దుర్మరణం చెందారు.  ఆగ్రా కంటోన్మెంట్ నుంచి మధురకు వెళుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. న్యూఢిల్లీ-బెంగళూరు మధ్య నడిచే కర్ణాటక ఎక్స్ ప్రెస్ లో సోమవారం నాడు  ఆగ్రా కంటోన్మెంట్ స్టేషన్ లో ఆయన ఎక్కారు. మధుర రైల్వేస్టేషన్ లో కదులుతున్న రైలు నుంచి దిగబోయిన ఆయన అదుపుతప్పి  రైలు చక్రాల కింద పడిపోవడంతో మృతి చెందారు.  

  • Loading...

More Telugu News