: సినీ నటి కవితతో బుల్లితెర నటి శ్రీవాణి వివాదం
వదినను కొట్టి వివాదం రేపిన బుల్లితెర నటి శ్రీవాణి తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. టీడీపీ నేత, సినీ నటి కవితతో శ్రీవాణికి రెమ్యూనరేషన్ విషయంలో వివాదం రేగింది. ఆ వివరాల్లోకి వెళ్తే... శ్రీవాణి భర్త విక్రమాదిత్య 'కెవ్వు కబడ్డి' అనే షోను నిర్వహిస్తున్నారు. జెమినీ టీవీలో శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో 60 మంది టీవీ నటులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించాలని కవితను కోరారు.
ఏడు రోజుల షెడ్యూల్, ఒకరోజు ప్రోమో షూట్ లో పాల్గొనాలని ఒప్పందం చేసుకున్నారు. రోజుకు 25 వేల రూపాయలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. దీనికి సంబంధించిన 75 వేల రూపాయలు ఆమెకు అందజేసి, మిగిలిన మొత్తానికి చెక్ ఇచ్చారు. ఆ చెక్కు బ్యాంకుకు వెళ్లి మార్చుకునే సమయానికి స్టాప్ పేమెంట్ పెట్టారు. దీనిపై కవిత మండిపడుతున్నారు. షెడ్యూల్ ప్రకారం షూటింగ్ లో పాల్గొన్నాక స్టాప్ పేమెంట్ ఎందుకు పెట్టారని కవిత ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.