: నిక్ నేమ్ తోనే రాణాకు శుభాకాంక్షలు తెలిపిన బన్నీ
ప్రముఖ నటుడు రానా ఈరోజు తన 32వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా, సినీ ప్రముఖులు తమ ట్వీట్ల ద్వారా ‘బాహుబలి రానా’కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా రానాకు బర్త్ డే విషెస్ తెలిపాడు. అయితే, రానాకు బన్నీ పెట్టిన నిక్ నేమ్ తో ఈ విషెస్ తెలియజేయడం విశేషం. ఇంతకీ, రానాకు పెట్టిన ఆ నిక్ నేమ్ ఏమిటంటే.. ‘ఫైరీ’. ‘మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఫైరీ (రానాకు నేను పెట్టిన నిక్ నేమ్)’ అని బన్నీ ఆ పోస్ట్ లో పేర్కొన్నాడు.