: ఎస్బీఐ ఏటీఎం నుంచి నకిలీ పెద్ద నోటు!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఏటీఎం నుంచి నగదు డ్రా చేసుకునేందుకు వెళ్లిన ఒక వ్యవసాయదారుడికి నకిలీ పెద్ద నోటు వచ్చింది. ఈ నోటును వేరే వ్యక్తికి ఇవ్వగా, ఆ నోటు నకిలీదని చెప్పడంతో అతను బిక్కమొహం వేసిన సంఘటన బీహార్ లో జరిగింది. సీతామహ్రి జిల్లా లంగ్మా ప్రాంతానికి చెందిన పంకజ్ కుమార్ అనే వ్యవసాయదారుడు నిన్న అక్కడి ఏటీఎంలో రెండు వేల నోట్లను డ్రా చేసుకున్నాడు. ఈ నోట్లలో ఒక నోటును వేరే వ్యక్తికి ఇవ్వగా అది నకిలీదని చెబుతూ తీసుకునేందుకు నిరాకరించాడు. వెంటనే, బ్యాంక్ కి, డుమ్రా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఈ విషయమై ఆయన ఫిర్యాదు చేశాడు. ఈ విధంగా జరగడానికి వీలులేదని, ఏటీఎం ఖజనా లోపల కరెన్సీని ప్రైవేట్ సంస్థ అధికారుల సమక్షంలో బ్యాంకు అధికారులు తనిఖీ చేసి, వాటికి సీల్ కూడా వేస్తామని సదరు బ్రాంచ్ చీఫ్ మేనేజర్ సుధాంశు కుమార్ పేర్కొన్నారు.