: ఆ సంస్థకు ‘ఎమోజీ’ ట్రాన్స్ లేటర్ కావాలట !


ఎటువంటి పదాలు వాడకుండా మన భావాలను అవతలి వ్యక్తికి స్మార్ట్  ఫోన్ ద్వారా తెలియజేయడంలో ‘ఎమోజీ’లకు ఉన్న పాత్ర అంతాఇంతా కాదు. అయితే, ఈ ‘ఎమోజీ’లలో కొన్నింటికి అర్థాలు తెలిసినప్పటికీ, అర్థం చేసుకోలేక తలపట్టుకునే పరిస్థితులు కల్పించే ‘ఎమోజీ’లూ లేకపోలేదు. అయితే, ఇదే సమస్యతో సతమతమవుతున్న లండన్ లోని ఒక ట్రాన్స్ లేషన్ సంస్థ ఒక నిర్ణయం తీసుకుంది.

‘ఎమోజీ’లను ట్రాన్స్ లేట్ చేసి వాటి భావాన్ని చక్కగా పొందుపరచగలిగే  ట్రాన్స్ లేటర్లను నియమించాలనుకుంది. ఈ నేపథ్యంలో ఎమోజీ ట్రాన్స్ లేటర్ కావాలంటూ సదరు సంస్థ వారి వెబ్ సైట్ లో ఒక ప్రకటన కూడా చేసింది. ఈ సందర్భంగా ట్రాన్స్ లేషన్ సంస్థ సీఈఓ జుర్గా జిలిన్స్ కీన్ మాట్లాడుతూ, ‘ఎమోజీ’లను ట్రాన్స్ లేట్ చేయడానికి తమ వద్ద ఒక సాఫ్ట్ వేర్ ఉన్నప్పటికీ, అది పూర్తి స్థాయిలో ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని  చెప్పారు.

‘ఎమోజీ’ల వినియోగానికి సంబంధించి  ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక విభేదాలు తమ వద్ద  ఉన్న సాఫ్ట్ వేర్ కు సవాల్ గా నిలిచాయన్నారు. అందుకే,  ‘ఎమోజీ’లను మెషీన్ ద్వారా కాకుండా హ్యుమన్ ట్రాన్స్ లేషన్ చేయించాలని నిర్ణయించామన్నారు.  ‘ఎమోజీ’  ట్రాన్స్ లేటర్ కావాలనే తమ ప్రకటన వెనుక ఉన్న అసలు విషయాన్ని సంస్థ సీఈఓ ప్రస్తావిస్తూ ... ఓ క్లయింట్ తమ వద్దకు వచ్చి వారికి సంబంధించిన ఒక డైరీలోని విషయాలను పూర్తిగా ఎమోజీల రూపంలోకి అనువదించాలని కోరారని, దీంతో, ‘ఎమోజీ ట్రాన్స్ లేటర్’ ఉండాలనే ఆలోచన తనకు వచ్చిందని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News