: సీఎం క్యాంప్ ఆఫీసులో సందడి చేసిన కేసీఆర్ మనవడు
బేగంపేటలోని సీఎం క్యాంప్ ఆఫీసులోముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాంశ్ సందడి చేశాడు. ఉబర్ ట్యాక్సీ బైకులను కేసీఆర్ నిన్న ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్ తో పాటు మనవడు హిమాంశ్ కూడా వచ్చాడు. కేసీఆర్ సమక్షంలో హిమాంశ్ బ్యాటరీ వాహనాన్ని నడిపి అందరినీ ఆకట్టుకున్నాడు. కాగా, మొదటి విడతగా 72 ఉబర్ ట్యాక్సీ బైకులు రోడ్లపైకి వచ్చాయి. ఈ బైక్ లకు డ్రైవర్లను సమకూర్చి వినియోగదారులను గమ్యస్థానానికి సురక్షితంగా చేర్చుతారు. ఈ విధంగా ప్రయాణం చేసే వినియోగదారుడు కిలోమీటర్ చొప్పున రేటును చెల్లించాల్సి ఉంటుంది.