: జగన్.. టైమ్, ప్లేస్ డిసైడ్ చెయ్... నేను రెడీ!: నారా లోకేశ్ సవాల్
వైసీపీ అధినేత జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సవాల్ విసిరారు. రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని... టైమ్, ప్లేస్ డిసైడ్ చేసుకోవాలని ఛాలెంజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి జగన్ కు కనీస అవగాహన కూడా లేదని విమర్శించారు. సాక్షి పత్రికకు, జగన్ కు అభివృద్ధి ఎంతమాత్రం కనపడదని అన్నారు. తెలంగాణలో ఉంటూ విమర్శలు చేయడం మానుకోవాలని... ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి, అభివృద్ధిని చూడాలని చెప్పారు. ఈ రోజు గుంటూరు జిల్లాలోని యడ్లపాడు మండలం తిమ్మాపురంలో లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పై విమర్శలు కురిపించారు. ఏపీకి సమర్థుడైన ముఖ్యమంత్రి ఉన్నారని... సమర్థుడైన ప్రతిపక్షనేత మాత్రం లేడని ఎద్దేవా చేశారు.