: మరోసారి ఆస్కార్ బరిలో నిలిచిన రెహమాన్


మన దేశం గర్వించదగ్గ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మరోసారి ఆస్కార్ బరిలో నిలిచారు. అయితే భారతీయ సినిమా ద్వారా ఆయన ఈసారి బరిలో నిలవలేదు. బ్రెజిల్ కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత సాకర్ ప్లేయర్ పీలే బయోపిక్ అయిన 'పీలే: బర్త్ ఆఫ్ ఏ లెజెండ్' చిత్రం ద్వారా ఆస్కార్ పోటీలో నిలిచారు. ఒరిజినల్ స్కోర్, ఒరిజినల్ సాంగ్ విభాగాలకుగాను రెహమాన్ పోటీ పడుతున్నారు. నామినేషన్ల తుది జాబితాను జనవరి 24న విడుదల చేస్తారు. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 26న నిర్వహించనున్నారు. 2009లో 'స్లమ్ డాగ్ మిలియనీర్' చిత్రానికి గాను రెహమాన్ రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్నారు. 2011లో రెండు ఆస్కార్ నామినేషన్లు రెహమాన్ కు లభించాయి. 2014లో రెహమాన్ మ్యూజిక్ అందించిన రెండు హాలీవుడ్ సినిమాలు, భారతీయ సినిమా 'కొచ్చాడయాన్'లు కూడా ఆస్కార్ కోసం పోటీ పడ్డాయి. కానీ, అవార్డును అందుకోలేకపోయాయి. 

  • Loading...

More Telugu News