: అంత చరిత్ర గల అమెరికాలోనే డిజిటల్ బ్యాంకింగ్ పూర్తిగా సాధ్యం కాలేదు: ఎమ్మెల్యే రోజా
రెండు వేల నోటు కోసం సామాన్యుడు బ్యాంకులు, ఏటీఎంల దగ్గర ఇబ్బంది పడుతున్నారని వైఎఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, పబ్లిసిటీ కోసమే వందశాతం డిజిటల్ బ్యాంకింగ్ అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అంటున్నారని, వందశాతం అక్షరాస్యత సాధించకుండా..హండ్రెడ్ పర్సెంట్ డిజిటల్ బ్యాంకింగ్ ఎలా సాధ్యమవుతుందని ఆమె ప్రశ్నించారు. అమెరికాలోనే డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తి స్థాయిలో సాధ్యం కాలేదని, అలాంటప్పుడు, మనదేశంలో ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. చంద్రబాబు తన నల్లధనాన్ని మార్చుకునేందుకు ఏ విధంగానైతే హెరిటేజ్ సంస్థలను అమ్మేసుకున్నారో కళ్లారా చూశామని అన్నారు. కేంద్రంలో కార్పొరేట్ శక్తులకు ప్రధాని నరేంద్ర మోదీ అభయమిస్తే, ఏపీలో మాత్రం తన కుటుంబానికి చెందిన సంస్థలకు ఏ విధంగా న్యాయం చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని విమర్శించారు.