: ‘ఫ్లిప్ కార్ట్’ నుంచి మరో కొత్త ఆఫర్!
‘ఫ్లిప్ కార్ట్’ ద్వారాఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసిన జంటలకు హాలిడే ట్రిప్ కు వెళ్లే గొప్ప అవకాశం లభించనుంది. ‘బిగ్ షాపింగ్ డేస్’ పేరిట ఈ నెల 18 నుంచి 21 వరకు నాలుగు రోజుల పాటు డిస్కౌంట్ సేల్ ను ‘ఫ్లిప్ కార్ట్’ తీసుకొస్తోంది. కేవలం డిస్కౌంట్ మాత్రమే కాక మరో కొత్త ఆఫర్ ను సదరు సంస్థ ప్రకటించింది. ఈ నాలుగు రోజుల్లో ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసిన పది జంటలను ఎంపిక చేసి వారిని యూరప్, శ్రీలంక, అండమాన్, మారిషస్, హిమాచల్ ప్రదేశ్ లో ఎక్కడికైనా హాలిడే ట్రిప్ కు పంపనున్నట్లు ‘ఫ్లిప్ కార్ట్’ పేర్కొంది.
ఈ నాలుగు రోజుల్లో ఎస్ బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే వాటిపై పదిశాతం తగ్గింపు అందిస్తున్నట్లు ‘ఫ్లిప్ కార్ట్’ పేర్కొంది. కాగా, మోటో, ఈ3, సామ్ సంగ్ గేర్ ఫిట్ 2, వీయూ టీవీలపై ‘ఫ్లిప్ కార్ట్ ’ డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయమై సదరు సంస్థ అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. ప్రస్తుతం ఉన్న ఫోన్లతో పాటు, కొత్తగా మార్కెట్ లోకి ప్రవేశించిన ఫోన్లపై కూడా డిస్కౌంట్ తో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ను కూడా ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం అయిన ఫ్లిప్ కార్ట్ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.