kcr: నగదు రహిత లావాదేవీల దిశగా మనం వెళ్లాల్సిందే: సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. నగదు రహిత లావాదేవీల దిశగా మనం వెళ్లాల్సిందేనని చెప్పారు. పెద్దనోట్లు రద్దు అయిన నేపథ్యంలో ఆ ప్రభావం తెలంగాణపై భారీగా ఉంటుందని చెప్పారు. ఆర్థిక లావాదేవీలన్నీ జరిగాలంటే మొబైల్ యాప్‌ల వినియోగం పెరగాలని, నగదురహిత లావాదేవీలపై అవగాహన కల్పించాలని వీటిపై విద్యార్ధులు, టీచర్లు, ఉద్యోగులకు శిక్షణ కూడా ఇవ్వాలని చెప్పారు.
తెలంగాణలో చేసిన కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో సగటున 4 లక్షల కుటుంబాలకు ఒక జిల్లా ఉందని, సర్కారు అందిస్తోన్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరడం ఇక సులువవుతుందని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో గుడంబా, పేకాట లాంటి అవలక్షణాలను అరికట్టగలిగామని, ప్రజల సహకారం వల్లే ఇది సాధ్యమయిందని కేసీఆర్ అన్నారు. ప్రతి జిల్లా కలెక్టర్‌కు రూ. 3 కోట్ల నిధులు కేటాయిస్తున్నామని, అత్యవరసర పనుల కోసం వాటిని వినియోగించాలని సూచించారు.