: ఈ రోజు పరిటాల సునీత చేసిన దౌర్జన్యాన్ని రాష్ట్రమంతా చూసింది: వైసీపీ ఆరోపణ
అనంతపురం జిల్లా కనగానపల్లె ఎంపీపీ ఉపఎన్నిక సందర్భంగా మంత్రి పరిటాల సునీత చేసిన దౌర్జన్యాన్ని రాష్ట్రమంతా చూసిందని వైసీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని ఉంచి... ఏదో జరగబోతోందని డీజీపీ, కలెక్టర్, ఎస్పీలకు ముందుగానే చెప్పామని... కానీ, అసలు ఎన్నికే జరగకుండా డిక్లరేషన్ ను ఆర్డీవో ఇచ్చేశారని... ఇది ఎంతవరకు న్యాయమని విమర్శించారు. ఎంపీపీ ఉపఎన్నికలో ఎవరూ చేతులు ఎత్తలేదని, సంతకాలు చేయలేదని... తమ సభ్యులపై దౌర్జన్యం చేసి, ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. తమ తరపున ఉన్న రాజేంద్ర, వెంకట్రామిరెడ్డిలను కొట్టారని... సీఐ ఎదుటే దౌర్జన్యం చేశారని విమర్శించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిటాల సునీత ఖూనీ చేశారని మండిపడ్డారు.