: ట్రంప్ హెచ్చరిక ఫలిస్తోంది... 25 వేల ఉద్యోగులను తీసుకుంటామని ప్రకటించిన ఐబీఎం
అమెరికా సంస్థలు అమెరికన్లకు ఉద్యోగాలను కల్పించకుండా, విదేశాలకు ఉద్యోగాలను తరలిస్తున్నాయని... తాను అధికారాన్ని చేపట్టిన తర్వాత ఇలాంటి వాటిని ఉపేక్షించనని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఐబీఎంలాంటి కంపెనీలు అమెరికాలో వేలాది ఉద్యోగాలను తొలగిస్తూ, భారతీయ ఉద్యోగుల వైపు మొగ్గు చూపుతున్నాయని ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, టెక్ దిగ్గజం ఐబీఎం అమెరికన్లకు భారీ సంఖ్యలో ఉద్యోగాలను కల్పించనున్నామని ప్రకటించింది. రానున్న నాలుగు సంవత్సరాలలో 25 వేల ఉద్యోగులను తీసుకుంటామని తెలిపింది. వివిధ టెక్నాలజీ దిగ్గజాలతో డొనాల్డ్ ట్రంప్ భేటీ కావడానికి ఒక రోజు ముందు ఐబీఎం ఈ ప్రకటన చేయడం గమనార్హం.