: పార్లమెంటులో భద్రతావలయాన్ని ఛేదించుకుని రాహుల్ వద్దకు వెళ్లిన హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి.. చర్యలు తీసుకోనున్న అధికారులు!


హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి పార్లమెంటు ప్రాంగణంలో ఈరోజు కలకలం సృష్టించారు. ఎంపీ పాస్ పై పార్లమెంట్ సెషన్ కు ఈరోజు ఆమె వెళ్లారు. గ్యాలరీ నుంచి సమావేశాలను వీక్షించారు. ఆ తర్వాత లోక్ సభ రేపటికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అయితే అనూహ్యంగా అక్కడ కార్తీక ప్రత్యక్షమయ్యారు. భద్రతావలయాన్ని ఛేదించుకుని రాహుల్ వద్దకు కార్తీక రావడంతో, అధికారులు అప్రమత్తం అయ్యారు. నిబంధనలను ఉల్లంఘించిన ఆమెపై చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. జరిగిన ఘటనపై పార్లమెంట్ సెక్యూరిటీ విచారణ చేపట్టారు. 

  • Loading...

More Telugu News