: భారత్ లో క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ దిశగా చర్యలు: వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ
మలేషియాలోని కౌలాలంపూర్‌లో ఆసియా బిజినెస్ లీడర్స్ సదస్సు-2016 కొనసాగుతోంది. ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఢిల్లీ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. 21వ శతాబ్దం ఆసియాదేనని ఆయన అన్నారు. మలేషియాతో సత్సంబంధాలు నెలకొల్పుతున్నామని చెప్పారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని... నల్లధనం, అవినీతి నిరోధానికి పెద్దపీట వేశామని చెప్పారు. భారత్‌లో వచ్చే ఏడాది జీఎస్‌టీని అమలులోకి తీసుకురావాలనుకుంటున్నామని, ఆర్థిక సరళీకరణకు భారత్ ఓ సాక్షిగా నిలుస్తోందని ఆయన అన్నారు. భారత్ లో క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ దిశగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.