: రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ టీవీ నటుడు
సోనీ టీవీలో ప్రసారమయ్యే 'క్రైమ్ పెట్రోల్'లో పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించిన కమలేశ్ పాండే ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఉన్న తన ఇంట్లో రివాల్వర్ తో కాల్చుకుని ఆయన ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన జరిగినప్పుడు అతని భార్య సోదరి అంజనీ కూడా అక్కడే ఉన్నారు. కొన్ని రోజుల క్రితం అంజనీ కుమార్తె వివాహం జరిగింది. అయితే, ఈ వివాహానికి కమలేశ్ ను ఆహ్వానించలేదట. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన కమలేశ్... మద్యం సేవించి, ఇంట్లో పెద్ద గొడవ చేశాడట. అనంతరం తన రివాల్వర్ తీసి, మొదట్లో గాలిలోకి కాల్పులు జరిపాడు. ఆ తర్వాత తన ఛాతీకి గురి పెట్టుకుని, కాల్చుకున్నాడు. అంబులెన్స్ వచ్చే లోపలే అతను చనిపోయినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనను ఆత్మహత్యగానే పరిగణిస్తున్నామని... పోస్టుమార్టం రిపోర్ట్ లో స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు.