: 25 మంది జర్నలిస్టులకు లంచమిస్తున్న చంద్రబాబు: ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆరోపణ


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రముఖ న్యాయవాది, పబ్లిక్ ఇంటరెస్ట్ యాక్టివిస్ట్, స్వరాజ్ అభియాన్ వ్యవస్థాపక సభ్యుడు ప్రశాంత్ భూషణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. జాతీయ స్థాయిలో తనకు అనుకూలంగా కథనాలు రాయించుకోవడం కోసం 25 మంది జర్నలిస్టులను చంద్రబాబు నియమించుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు పబ్లిసిటీ కోసం వీరంతా పని చేస్తారని... అందుకోసం వీరందరికీ ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రతినెలా లంచాలు ఇస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఆర్థికశాఖ విడుదల చేసిన జీవో నెం.2497ను కూడా ప్రశాంత్ భూషణ్ అప్ లోడ్ చేశారు. ఈ నెల 7వ తేదీన ఈ జీవోను విడుదల చేశారు.  

  • Loading...

More Telugu News