: తుపాను సమయంలో ఒక్క పక్షి కూడా లేదు... అప్పటికే సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నాయి!
వార్దా తుపాను ధాటికి చెన్నై నగరం అతలాకుతలం అయింది. వేలాది వృక్షాలు నేలకొరిగాయి. రోడ్లు, రైలు మార్గాలు ధ్వంసమయ్యాయి. అయితే, తుపాను రాకను ముందే పసిగట్టిన పక్షులు మాత్రం సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాయి. అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తుపాను వివరాలను వాతావరణ శాఖ మనకు తెలియజేస్తుంటుంది. కానీ, ఏ పరికరాలు లేకుండానే పక్షులు ప్రకృతి విలయాన్ని ముందే పసిగడుతున్నాయి. తుపాను వచ్చే సమయానికి ఒక్క పక్షి కూడా అక్కడ కనిపించలేదు. ప్రకృతి విపత్తుల కాలంలో జంతువులు సురక్షిత ప్రాంతాలను తరలి వెళ్తుండగా, పక్షులు సుదూర ప్రాంతాలకు తరలిపోతాయి. వీటికి ఉన్న సూక్ష్మ గ్రాహకశక్తి కారణంగానే... అవి విపత్తులను ముందుగానే పసిగడుతున్నాయి.