: పార్లమెంటు ఉభయసభలు ప్రారంభం.. హాజరైన మోదీ.. మూడు నిమిషాలకే లోక్‌సభ వాయిదా
పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరయ్యారు. ప్రారంభమైన మూడు నిమిషాలకే లోక్‌సభ వాయిదా పడింది. పెద్దనోట్ల రద్దుపై గందరగోళం నెలకొనడంతో లోక్‌సభను ఈ రోజు మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. మరోవైపు రాజ్యసభ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలు అంశాలపై సభ్యులు చర్చిస్తున్నారు.