: రూ. 250 కరెన్సీ నోటు రాబోతోందా? రూ. 2000 నోటు రద్దు?
పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ. 2000 నోటు చలామణిలోకి వచ్చింది. అయితే, ఈ నోటు ఎక్కవ కాలం ఉండదని తెలుస్తోంది. రూ. 2000 నోటును కూడా రద్దు చేస్తారని ప్రధాని మోదీ సన్నిహితుడు ఆడిటర్ గురుమూర్తి తెలిపారు. అంతేకాదు, రూ. 250 విలువైన నోటు చలామణిలోకి వస్తుందని ఆయన చెప్పారు. ఆర్ఎస్ఎస్ లో కీలకపాత్ర పోషించే గురుమూర్తి... ప్రధాని మోదీకి సలహాదారుగా కూడా వ్యవహరిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ సూచనల మేరకు రూ. 2000 నోటును అప్పటికప్పుడు ముద్రించి, విడుదల చేశారని ఆయన చెప్పారు. రూ. 100, రూ. 250, రూ. 500 నోట్లను ముద్రించి, చలామణిలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు.