: ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ... అస్త్రశస్త్రాలతో ఉభయపక్షాలు సిద్ధం


నాలుగు రోజుల విరామం అనంతరం ఈ రోజు పార్లమెంటు సమావేశాలు మళ్లీ మొదలు కానున్నాయి. ఈ సమావేశాల్లో ఇప్పటివరకు జరిగింది ఏమీ లేదు. పెద్ద నోట్ల రద్దు అంశం పార్లమెంటు ఉభయసభలను కుదిపేస్తోంది. సభల్లో గందరగోళం చెలరేగడం, వాయిదా పడటం... ఇప్పటి దాకా ఇదే జరిగింది. ఈ నేపథ్యంలో, అగస్టా కుంభకోణంపై కాంగ్రస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు బీజీపీ వ్యూహరచన చేసింది. మరోవైపు నోట్ల రద్దు,  కేంద్ర మంత్రి రిజిజుపై అవినీతి ఆరోపణలను విపక్షాలు లేవదీయబోతున్నాయి. మరో మూడు రోజులు మాత్రమే పార్లమెంటు కొనసాగనుంది. దీంతో, కొన్ని బిల్లులను పాస్ చేయించుకోవడానికి అధికారపక్షం కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో, తన ఎంపీలందరికీ విప్ జారీ చేసింది. 

  • Loading...

More Telugu News