: ‘వార్దా’ ఎఫెక్ట్: హైదరాబాద్‌లో వర్షం.. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం
‘వార్దా’ తుపాను ప్రభావంతో మంగళవారం రాత్రి 11:00 గంటల నుంచి హైదరాబాద్‌లో వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, శ్రీకృష్ణానగర్, ఫిల్మ్‌నగర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కాగా ఇప్పటికే తుపానుతో అతలాకుతలమైన తమిళనాడును మరో భయం వెంటాడుతోంది. వచ్చే 24 గంటల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కర్ణాటక, ఉత్తర కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.