: లుఫ్తాన్సా విమానానికి బాంబు బెదిరింపు
లుఫ్తాన్సా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో కలకలం రేగింది. వివరాల్లోకి వెళ్తే... టెక్సాస్ లోని హ్యూస్టన్ నుంచి జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ కు వెళ్లాల్సిన లుఫ్తాన్సా 441 విమానంలో బాంబు ఉందంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానాన్ని న్యూయార్క్ లోని జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయానికి దారిమళ్లించారు.
అక్కడ విమానంలోని అణువణువు తనిఖీలు నిర్వహించారు. అయితే విమానంలో ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించకపోవడంతో అంతా హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. ఆ సమయంలో విమానంలో 530 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. అనంతరం విమానాన్ని రీషెడ్యూల్ చేశారు. దీని వల్ల జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇతర విమానాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదని అధికారులు తెలిపారు.