: మెస్సీ చంకనెక్కి కల నెరవేర్చుకున్న ఆరేళ్ల బుడతడు!


ఆరేళ్ల బాలుడు తన కోరికను ఊహించని విధంగా నెరవేర్చుకుని సంతోషభరితుడయ్యాడు. వివరాల్లోకి వెళ్తే... కొన్నాళ్ల క్రిందట పచ్చ, తెలుపు చారలున్న ప్లాస్టిక్ బ్యాగును జెర్సీలా ధరించి, దానిపై తన అభిమాన ఫుట్ బాల్ ఆటగాడు మెస్సీ పేరు రాసుకుని ఓ బుడతడు మైదానంలో ఆడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. దీనిని చూసిన అర్జెంటీనా స్టార్ స్ట్రైకర్ లియోనెల్ మెస్సీ ఆ బాల అభిమాని గురించి ఆరాతీశాడు. దీంతో ఆరేళ్ల ఆ బాలుడు ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన ముర్తజా అహ్మదీ అని తెలుసుకున్నాడు. దీంతో తన బుల్లి అభిమానికి ఒక జెర్సీని పంపించి, నేరుగా తన జెర్సీ ధరించే అవకాశం కల్పించాడు.

 దీంతో ఆఫ్ఘనిస్థాన్ లో తీవ్రవాదుల నుంచి ఆ బుడతడికి బెదిరింపులు వస్తున్నాయి. దీంతో తన కుమారుడ్ని కిడ్నాప్ చేసి చంపేస్తారేమోనని ఆందోళన చెందిన ముర్తజా అహ్మదీ తండ్రి ఆరిఫ్ తన మకాం పాకిస్థాన్ లోని క్వెట్టాకు మార్చాడు. మెస్సీ ఆహ్వానంతో దోహా వెళ్లిన ముర్తజా అహ్మదీని తన అభిమాన ఆటగాడిని కలిశాడు. ముద్దుగా ఉన్న అహ్మదీని ఎత్తుకుని ఫోటోలు, వీడియోలకు పోజులిచ్చాడు. దీంతో  అహ్మదీ ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. 

  • Loading...

More Telugu News