: రాజకీయ నేతలకు షాకింగ్... కీలక సిఫారసులు చేసిన ఈసీ
దేశ వ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు ఒక్కోసారి ఒకేసారి రెండు స్థానాల్లో పోటీ చేస్తుండటం మనం చూస్తున్నాం. దీని వల్ల ప్రభుత్వానికి అనవసరమైన ఖర్చు అవుతోంది. గెలుపొందిన రెండు స్థానాల్లో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. దీంతో, ఆ స్థానానికి మళ్లీ ఉపఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి కీలక సిఫారసు చేసింది. ఏ అభ్యర్థి అయినా కేవలం ఒకే స్థానం నుంచి పోటీ చేయాలనే చట్ట సవరణ తీసుకురావాలని సూచించింది. ఒక వేళ రెండు స్థానాల్లో పోటీ చేసే నిబంధనను కొనసాగించాలనుకుంటే... గెలిచిన అభ్యర్థి, రెండో స్థానానికి రాజీనామా చేసి, ఉప ఎన్నికకు కారణమైతే... ఆ ఎన్నికకు అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వానికి చెల్లించేలా నిబంధన తీసుకురావాలని సూచన చేసింది.
1996కు ముందు వరకు సాధారణ ఎన్నికలు కానీ, ఉప ఎన్నికలు కానీ ఒక వ్యక్తి గరిష్ఠంగా ఎన్ని చోట్లైనా పోటీ చేసేందుకు అవకాశం ఉండేది. 1996లో ఎన్నికల సవరణతో ఒక అభ్యర్థి రెండు స్థానాల్లో మాత్రమే పోటీ చేేసేలా పరిమితి విధించారు.