: రూ. 450 కోట్ల అవినీతిలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పాత్ర ఉంది... కాంగ్రెస్ ఆరోపణలు
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో నిర్మిస్తున్న 600 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టులో రూ. 450 కోట్ల మేర అవినీతి జరిగిందని... అందులో రిజిజు పాత్ర కూడా ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దీనికి సంబంధించిన ఆడియో టేపులు కూడా తమ వద్ద ఉన్నాయని తెలిపింది. కేంద్ర మంత్రి వర్గం నుంచి రిజిజును తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. మరోవైపు దీనిపై రిజిజు స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను ఖండించారు. ఇలాంటి కథనాలను సృష్టించేవారు తమ ముందుకొస్తే చెప్పు దెబ్బలు తింటారని హెచ్చరించారు. ప్రజలకు సేవ చేయడం కూడా అవినీతేనా? అంటూ ప్రశ్నించారు.