: సల్మాన్ సీక్రెట్లు చెప్పేసిన సోదరులు!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సీక్రెట్లను సోదరులిద్దరూ బయటకు చెప్పేశారు. మంచి మానవ సంబంధాలు నడపడంలో సల్మాన్ తరువాతే ఎవరైనా అని సల్మాన్ సోదరులు అర్భాజ్ ఖాన్, సోహైల్ ఖాన్ ఓ టీవీ షోలో మాట్లాడుతూ చెప్పారు. తమ సోదరుడు శృంగారం లేకుండా ఉండలేడని అన్నారు. 'నో సెక్స్ ఫర్ ఏ మంత్ ఛాలెంజ్' ఇస్తే తమ సోదరుడు దానిని స్వీకరించడని వారిద్దరూ తెలిపారు. తమ సోదరుడికి శృంగారం చాలా ఇష్టమని వారు చెప్పారు.
సల్మాన్ పెళ్లి గురించి ఎన్నో ఏళ్లుగా ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, సల్మాన్ వివాహం చేసుకోవడం తమకు ఇష్టం లేదని సోదరులు తెలిపారు. సమాజాన్ని, చుట్టూ జరుగుతున్న పరిస్థితులను చూసిన తరువాత ఆయన పెళ్లి చేసుకోవాలని కోరడం సమంజసం కాదని వారు అభిప్రాయపడ్డారు. కాగా, అర్భాజ్ ఈ మధ్యే భార్య మలైకా నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. పాటలకు కత్రినాతో డాన్స్ చేసే అర్హత తమ సోదరుడికి మాత్రమే ఉందని వారు స్పష్టం చేశారు.