: అదుపుతప్పి సీపీఎం పాదయాత్రలోకి దూసుకొచ్చిన లారీ... ముగ్గురు నాయకులకు తీవ్ర గాయాలు
ఆదిలాబాద్‌లోని ఇచ్చోడ మండలం గాంధీనగర్‌లో సీపీఎం నేతలు మహా పాదయాత్ర చేస్తుండగా అటువైపుగా వెళుతున్న ఓ లారీ అదుపుతప్పి నాయకులను ఢీ కొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు సీపీఎం నాయకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే 108 ద్వారా అదిలాబాద్ రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా సీపీఎం నేతలు కార్యకర్తలతో కలిసి ఆదిలాబాద్‌లో ఈ మహ పాదయాత్ర నిర్వహిస్తున్నారు.