: బురఖా లేకుండా ఫొటో దిగినందుకు... కటకటాల వెనక్కి పంపారు!
చమురు దేశం సౌదీ అరేబియాలో ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేసి, కటకటాల వెనక్కి నెట్టారు. ఆమె చేసిన నేరం ఏమిటంటే... బురఖా లేకుండా రోడ్లపై తిరగడం. అంతేకాదు, అలాగే ఫొటో దిగి, దాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేయడం. ఈ నేపథ్యంలో, బురఖా లేకుండా ఫొటో దిగి, దాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం కాస్తా అక్కడి పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో, వారు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
సౌదీ అరేబియాలో మహిళలు బహిరంగ ప్రదేశాలలో బురఖాలు ధరించడం తప్పనిసరి. బురఖాలు లేకుండా తిరిగితే, కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, నైతిక నియమాలను ఉల్లంఘించినందుకే ఆమెను అరెస్ట్ చేసి, జైల్లో పెట్టామని తెలిపారు. ఇస్లాం చట్టాలను ఆమె ఉల్లంఘించిందని చెప్పారు. దేశంలో 'నిషేధించిన సంబంధాల' గురించి ఆమె తనకు సంబంధం లేని పురుషులతో మాట్లాడిందనే ఆరోపణలు కూడా ఆమెపై ఉన్నాయని తెలిపారు.