: మా నాన్న ఆరోగ్యంపై వచ్చిన వార్తలన్నీ అవాస్తవం: రజనీకాంత్ కుమార్తె


తన తండ్రి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని... ఆయన ఆరోగ్యంపై గతంలో వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలే అని సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య తెలిపారు. రజనీకాంత్ 66వ పుట్టినరోజు సందర్భంగా ఓ పత్రికకు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన తండ్రి చాలా సింపుల్ గా ఉంటారని... ఆడంబరాలకు ఆయన దూరమని తెలిపారు. సినిమా రిలీజైన తర్వాత, దాని జయాపజయాలను ఆయన పట్టించుకోరని... తర్వాత ఏమి చేయాలనే ఆలోచిస్తారని చెప్పారు. ప్రస్తుతం విరామం కూడా తీసుకోకుండా ఆయన 'రోబో 2.0' సినిమాలో నటిస్తున్నారని తెలిపారు. సూపర్ స్టార్ అయినప్పటికీ తాను ఎక్కడ నుంచి వచ్చారన్న సంగతిని నాన్న మరిచిపోరని... ఆయనకు సామాన్య అభిమాని అయినా, సినీ నిర్మాత అయినా ఒకటేనని చెప్పారు. 

  • Loading...

More Telugu News