: జూనియర్ ఆర్టిస్టు ఇంట్లో చోరీ.. నగదు, ఏటీఎం కార్డులతో పరారైన దొంగ


హైదరాబాద్‌లోని శ్రీకృష్ణనగర్‌లో నివసించే సినీ జూనియర్ ఆర్టిస్టు కె.సంతోషిశ్రీ (30) ఇంట్లో ఆదివారం రాత్రి దొంగతనం జరిగింది. రాత్రి ఇంట్లో తల్లితో కలిసి సంతోషి మాట్లాడుతున్న సమయంలో ఓ ఆగంతకుడు ఇంట్లోకి ప్రవేశించాడు. టేబుల్‌పైన ఉన్న రూ.7 వేల నగదుతోపాటు రెండు సెల్‌ఫోన్లు, ఏటీఎం కార్డులను దొంగిలించాడు. అలికిడి విన్న సంతోషి ఎవరో వచ్చారని భావించి గదిలోకి వచ్చే సరికి దొంగ పారిపోతున్నాడు. దీంతో అతడిని పట్టుకునేందుకు కొద్దిదూరం వెంబడించినా ఫలితం లేకుండా పోయింది. కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News