kcr: రాజకీయ రచ్చకు అసెంబ్లీ వేదిక కాకూడదు: సీఎం కేసీఆర్
ఈ నెల 16 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ రోజు సీఎం అధికార గృహం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు అర్థవంతంగా జరగాలని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు రాజకీయ రచ్చకు వేదిక కాకూడదని, ప్రజలకు ఉపయోగపడే రీతిలో సభలో చర్చలు కొనసాగాలని ఆకాంక్షించారు. సభలో విపక్ష సభ్యులు సంధించే ప్రశ్నలకు దీటుగా జవాబు ఇవ్వడానికి ప్రభుత్వ పక్ష సభ్యులు సిద్ధంగా ఉండాలని చెప్పారు. తెలంగాణలో తమ సర్కారు చేస్తోన్న కార్యక్రమాలను కూడా ప్రజలకు తెలపాలని ఆయన సూచించారు.