: ‘నలంద’ వ్యవహారంలో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంది?: బీహార్ సీఎం నితీశ్ కుమార్


నలంద విశ్వవిద్యాలయం వ్యవహారంలో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుందని బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రశ్నించారు. ఈ మేరకు కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ కు ఆయన ఒక లేఖ రాశారు. తన  ప్రమేయం లేకుండానే నలంద విశ్వవిద్యాలయం పాలక మండలి విషయంలో మార్పులు చేశారని, కనీసం విశ్వవిద్యాలయం వీసీకి కూడా తెలియకుండా ఈ మార్పులు చేశారని అన్నారు. ఇటువంటి చర్యల వల్ల విశ్వవిద్యాలయం స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుందని, అసలు, వీసీకి తెలియకుండా ఈ మార్పులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ప్రధాని మోదీ ప్రమేయం ఉందని ఆ లేఖలో నితీశ్ ఆరోపించారు.  

  • Loading...

More Telugu News