: అమెరికాలోని ‘ఆపిల్’ స్టోర్లలో దొంగతనాలు


అమెరికాలోని ‘ఆపిల్’ స్టోర్లలో దొంగతనాలు జోరుగా జరుగుతున్నాయి. కస్టమర్లను తలపించే విధంగా వస్తున్న ఈ దొంగలు, ఆయా స్టోర్లలోకి ప్రవేశించి చేతికందిన ఫోన్లను పట్టుకుపోతున్నారు. అయితే, ఆయా స్టోర్స్ సిబ్బంది వారిని అడ్డుకునేందుకు విఫలయత్నం చేస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ 25న శాన్ ఫ్రాన్సిస్కోలోని చెస్ట్ నట్ వీధిలో ఉన్న ఆపిల్ స్టోర్ లోకి ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వెళ్లి, క్షణాల్లో అక్కడి ఫోన్లను పట్టుకుని పారిపోయారు. నవంబర్ 29న అదే స్టోర్ లోకి నలుగురు వ్యక్తులు వచ్చి దొంగతనానికి పాల్పడ్డారు. కేవలం తొమ్మిది రోజుల్లో బెర్కెలీ లోని ఆపిల్ స్టోర్ లో మూడు సార్లు దొంగతనాలు జరిగాయి. ఈ విషయమై ఆయా స్టోర్ల సిబ్బంది పై అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం ఉండట్లేదట. వారు ఏమాత్రం పట్టించుకోవట్లేదట. కొసమెరుపు ఏమిటంటే, తస్కరణకు గురైన ఫోన్లు పనిచేయవని అంటున్నారు.  

  • Loading...

More Telugu News