: రజనీకాంత్ కు 66 ఏళ్లు..అయినా, స్టిల్ యంగ్.. దాని వెనుక రహస్యం ఇదే!
ఈరోజు తన 66వ పుట్టిన రోజు జరుపుకుంటున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, ఇప్పటికీ యంగ్ గా కనపడుతుంటారు. దీనికి కారణం ఆయన తీసుకునే డైట్, ఫిట్ నెస్ పై కనబరిచే శ్రద్ధేనట. ‘కింగ్ ఆఫ్ స్టైల్’ అని ఆయన అభిమానులు రజనీని పిలుచుకుంటూ ఉంటారు. మరి, ఈ ‘కింగ్ ఆఫ్ స్టైల్’ స్టిల్ యంగ్ గా కనపడడం వెనుక రహస్యాన్ని రజనీయే ఒక ఆడియో ఫంక్షన్ లో బయటపెట్టారు.
2008లో విడుదలైన కుసేలన్ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో తాను యంగ్ గా కనపడడానికి గల రహస్యాన్ని రజనీ బయటపెట్టారు. షుగర్, రైస్, మిల్క్, కర్డ్, ఘీ వంటి వాటికి రజనీ దూరంగా వుంటారట. ముఖ్యంగా నలభై సంవత్సరాలు పైబడిన తర్వాత వీటిని దూరం పెట్టిన వారెవరైనా సరే యంగ్ లుక్ సొంతం చేసుకోవచ్చని, ప్రతిరోజు ఉదయం 5 గంటలకు తాను నిద్రలేస్తానని, గంట పాటు జాగింగ్ చేస్తానని చెప్పారు. అంతేకాకుండా, రోజూ మెడిటేషన్ చేయడం, సాయంత్రాల్లో కూడా వాకింగ్ చేయడం, దీంతో పాటు, యోగా కూడా ప్రాక్టీసు చేస్తున్నానని నాడు రజనీ చెప్పారు. యోగా ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చని, రాత్రి నిద్ర బాగా పట్టేందుకు యోగా ఉపకరిస్తుందని.. ఈ ఆరోగ్య సూత్రాలనే తాను పాటిస్తుంటానని, అందుకే, యంగ్ గా కనపడతానని రజనీ నాడు చెప్పారు.