: ఆంధ్రప్రదేశ్ లో వార్దా తుపాను నేపథ్యంలో రైల్వే శాఖ హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఇవిగో!


వార్దా తుపాను ప్రభావంతో ప్ర‌కాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వ‌ర్షం కురుస్తోంది. దీంతో విజయవాడ-చెన్నై మార్గంలో ప్రయాణించే పలు రైళ్లను దారి మళ్లిస్తున్న‌ట్లు రైల్వే శాఖ పేర్కొంది. నెల్లూరు నుంచి చెన్నయ్ వెళుతున్న ప‌లు రైళ్లను రద్దు చేసిన‌ట్లు, ప్రధాన రైల్వేస్టేషన్లలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసిన‌ట్లు పేర్కొంది.  ప్రయాణికులు రైళ్ల రాక‌పోక‌ల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్లలో సంప్ర‌దించవ‌చ్చ‌ని ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంత ప్ర‌జ‌ల‌యినా 0866 248800 నెంబ‌రుకి ఫోను చేసి రైళ్ల వివ‌రాలు తెలుసుకోవ‌చ్చ‌ని తెలిపింది. విజయవాడ, నెల్లూరు, గూడూరులో ప్ర‌త్యేకంగా హెల్ప్‌లైన్ నెంబ‌ర్ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు పేర్కొంది. విజ‌య‌వాడ‌లో 0866 2575038, 1072, నెల్లూరు- 0861 2345864, 7702774104, గూడూరు- 9604506841 హెల్ప్‌లైన్ నెంబ‌ర్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది.

  • Loading...

More Telugu News