: ‘మెగా’ ఇమేజ్ ను పక్కనపెట్టి ఆయన ఎంతో సరదాగా ఉండే వారు: కాజల్
మెగాస్టార్ చిరంజీవి తన ఇమేజ్ ను పక్కనపెట్టి సెట్ లో అందరితో చాలా సరదాగా గడిపేవారని అందాల భామ కాజల్ ప్రశంసల వర్షం కురిపించింది. చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’లో చిరు సరసన నటిస్తున్న కాజల్, తాను నటించిన ఏ ఇతర హీరోతో కూడా అంత సరదాగా గడపలేదని చెప్పింది. సెట్లో ఉన్న వారందరితోను చిరంజీవి సరదాగా ఉంటూ జోకులు వేసేవారని, సెట్ లో తాను కంఫర్టబుల్ గా మూవ్ అయ్యేలా అవకాశం ఇచ్చారని చెప్పింది.
తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి ఒక గొప్ప డ్యాన్సర్ అని, డ్యాన్స్ చేసే సమయంలో ఆయన సలహాలు పాటించానని, దీంతో తన డ్యాన్స్ లో ఎంతో మార్పు వచ్చిందని పేర్కొంది. ఆ మార్పును సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు తెలుసుకోవచ్చని, చిరంజీవితో కలిసి నటించడం తన అదృష్టమంటూ కాజల్ సంతోషపడింది.