: ‘వార్దా’ తుపాను ప్రభావం: తిరుమలలో కుండపోత వర్షం.. కష్టాల్లో శ్రీవారి భక్తులు
దూసుకొస్తోన్న ‘వార్దా’ తుపాను ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ‘వార్దా’ ప్రభావంతో తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో కుండపోతగా వర్షం కురుస్తుండడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. గత అర్ధరాత్రి నుంచి తిరుపతిలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండడంతో నగరంలో దట్టంగా మంచు కమ్ముకుని శ్రీవారి దర్శనానికి వస్తోన్న యాత్రికుల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. తిరుమలలో వర్షంతో పాటు చలి తీవ్రత కూడా అధికంగా ఉంది. దీంతో శ్రీవారి భక్తులు కష్టాలు ఎదుర్కుంటున్నారు.