: శ్రీకాకుళం జిల్లాలో కంపించిన భూమి.. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో ఈ రోజు సంభవించిన భూప్రకంపనలు ప్రజలను భయాందోళనలకు గురిచేశాయి.
ఈ రోజు ఉదయం 8.48 గంటల సమయంలో దాదాపు మూడు సెకన్లపాటు స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. దీంతో భయపడిపోయిన మండలంలోని బురిడికంచరాం, తోలాపి, చింతలి, రాపాక, లోలుగు, కృష్ణాపురం తదితర గ్రామాల్లోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసి వీధుల్లోకి వచ్చారు. ఇదే మండలంలో కొన్ని రోజుల నుంచి పదే పదే భూమి కంపిస్తోంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.