: ముస్లిం సోదరులకు మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు: వైఎస్ జగన్
ఈరోజు మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ట్వీట్ చేశారు. ముస్లిం సోదరులకు, వారి కుటుంబ సభ్యులు సుఖ శాంతులు, సంతోషం, సౌభాగ్యం కలగాలని కోరుకున్నారు. శాంతి సామరస్యాలతో, సోదర భావంతో మెలగాలని మహ్మద్ ప్రవక్త ఇచ్చిన సందేశాన్ని ఈ సందర్భంగా జగన్ గుర్తుచేశారు.