: తుపాను తీరం దాటకముందే చెన్నైలో భారీ వర్షం... తీరం దాటితే బీభత్సమే...
చెన్నై నగరం చిగురుటాకులా వణికిపోతోంది. అతి తీవ్రమైన వార్దా తుపాను చెన్నై సమీపంలో మరో నాలుగు గంటల్లో తీరం దాటనుంది. తుపాను ఇంకా తీరం దాటకముందే చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. పలు చోట్ల చెట్లు విరిగి పడిపోవడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో, ముందు జాగ్రత్త చర్యగా పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అత్యవసర పని ఉంటే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని అధికారులు ప్రజలను హెచ్చరించారు. తుపాను తీరం దాటిన తర్వాత ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు చెన్నైలో కుండపోత వర్షం కురిసే అవకాశాలున్నాయి.