: మిర్యాలగూడ బస్సు డిపో ఎదుట ఔట్ సోర్సింగ్ కార్మికుల ఆందోళన


నల్గొండ జిల్లా మిర్యాల గూడ బస్సు డిపో ఎదుట ఔట్ సోర్సింగ్ కార్మికులు ఆందోళనకు దిగారు. గత మూడు నెలలుగా తమకు జీతాలు ఇవ్వడం లేదంటూ ఈరోజు ఉదయం నుంచే డిపో ఎదుట పెద్ద ఎత్తున కార్మికులు బైఠాయించారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు వారిని తరలించేందుకు యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా,ఆందోళన నిర్వహిస్తున్న స్కిల్డ్, అన్ స్కిల్డ్ కార్మికులకు ఏఐటీయూసీ  మద్దతు తెలిపింది.   

  • Loading...

More Telugu News