: విగ్రహ ప్రతిష్టాపనకు, జయలలిత మరణానికి సంబంధముందా?


జయలలిత మృతికి, కంచిలోని ఓ దేవాలయంలో విగ్రహ ప్రతిష్టకు సంబంధముందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంచీపురంలోని ప్రఖ్యాత పురాతన ఏకాంబరేశ్వరర్ ఆలయంలోని మూల విరాట్టు విగ్రహం కొన్ని కారణాల వల్ల ధ్వంసమైంది. దీంతో, కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. అయితే, చిన్నపాటి మరమ్మతులు చేస్తే సరిపోతుందని శిల్పులు చెప్పారు. మరోవైపు, మూల విరాట్టు విగ్రహాన్ని మార్చడం వల్ల రాష్ట్రాధినేతకు ప్రాణిహాని కలుగుతుందని కొందరు సూచించారు. ఇవేవీ పట్టించుకోని ఆలయ కమిటీ కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించింది. డిసెంబర్ 5న జయలలిత చనిపోయినట్లు అపోలో వైద్యులు ప్రకటించారు. ఏకాంబరేశ్వర్ ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్టించింది కూడా డిసెంబర్ 5వ తేదీనే!

  • Loading...

More Telugu News