: జువైనల్ హోం గార్డును కొట్టి బాలనేరస్తులు పరార్!


జువైనల్ హోం గార్డును కొట్టి బాలనేరస్తులు పరారైన సంఘటన మధ్యప్రదేశ్ లోని రాంజీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు చోటుచేసుకుంది. పలు కేసుల్లో రిమాండ్ లో ఉన్న 10 మంది బాలనేరస్తులు జువైనల్ హోం గార్డును తీవ్రంగా గాయపరిచి, తాళాలు లాక్కుని పరారయ్యారు. ఈ మేరకు రిమాండ్ హోం అధికారి పునిత్ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరారైన బాల నేరస్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని రాంజీ పోలీస్ స్టేషన్ పోలీసు అధికారి సంజయ్ శుక్లా తెలిపారు.

  • Loading...

More Telugu News