: తెలంగాణ ప్రజలు శాంతి కాముకులు: స్వామి అగ్నివేశ్


తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కూడా శాంతినే కోరుకుంటారని ప్రముఖ ఉద్యమకారుడు స్వామి అగ్నివేశ్ అంటున్నారు. ప్రత్యేక తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదిక అవాస్తవమని అగ్నివేశ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ తెలంగాణలో మనుగడ సాగించాలంటే ప్రత్యేక రాష్ట్రం ప్రకటించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహిస్తోన్న సంసద్ సత్యాగ్రహ దీక్షకు స్వామి అగ్నివేశ్ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ ఇస్తే పంజాబ్, హర్యానా మాదిరిగా పురోగామి పథంలో పయనిస్తుందని చెప్పారు.

  • Loading...

More Telugu News