: టీమిండియా ఘన విజయం.. ఇప్పటికే సిరీస్‌ కైవ‌సం!


 ముంబయిలో భారత్-ఇంగ్లండు క్రికెట్ టీమ్‌ల‌ మధ్య జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా విజ‌య‌భేరీ మోగించి, మ‌రో మ్యాచు మిగిలి ఉండ‌గానే సిరీస్‌ను కైవ‌సం చేసుకుంది.  ఐదో రోజు ఆట‌లో కేవ‌లం 8 ఓవ‌ర్ల‌కే ఇంగ్లండ్ ఆట‌గాళ్లు ఆలౌట్ అయ్యారు. మరోసారి ఆరువికెట్లు తీసిన అశ్విన్ ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ వెన్నువిరిచాడు. ఇంగ్లండ్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 400 ప‌రుగులు చేయ‌గా, టీమిండియా 631 ప‌రుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కేవ‌లం 195 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. దీంతో టీమిండియా ఇన్నింగ్స్ 36 ప‌రుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది. ఇంగ్లండ్ ఆట‌గాళ్లలో సెకండ్ ఇన్నింగ్స్‌లో కుక్ 18, జెన్నింగ్స్ 0, రూట్ 77, అలీ 0, బ‌యిర్ స్టో 51, స్టోక్స్ 18,  జేటీ బల్ 2, బ‌ట్ల‌ర్ 6, వోక్స్ 0, ర‌షీద్ 2, అండ‌ర్స‌న్ 2 ప‌రుగులు మాత్ర‌మే చేశారు. ఎక్స్ ట్రాల రూపంలో ఇంగ్లండ్ కు మ‌రో 19 ప‌రుగులు వ‌చ్చాయి. భారత బౌలర్లలో అశ్విన్ 6, జడేజా 2 వికెట్లు తీయగా యాదవ్, కుమార్‌ల‌కు చెరో వికెట్ ల‌భించాయి.

  • Loading...

More Telugu News