: ఆమె జయలలిత కుమార్తె కాదట... క్లారిటీ ఇచ్చిన గాయని చిన్మయి!
ఓ అందమైన ముఖం. మంచి వర్చస్సు. ముఖంలో రాజఠీవి. ఇవన్నీ ఉన్న ఓ మహిళ ఫొటో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయింది. ఆమె జయలలిత కుమార్తె అంటూ... అమెరికాలో రహస్యంగా ఉంటున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ, అదంతా అబద్దమే అని తేలిపోయింది. ప్రముఖ గాయని, డబ్బింగ్ కళాకారిణి శ్రీపాద చిన్మయి ఈమె విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
ఫొటోలో ఉన్న మహిళ పేరు దివ్యా రామనాథన్ వీరరాఘవన్. మంచి శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ప్రముఖ మృదంగ విద్వాన్ వి.బాలజీ కుటుంబానికి చెందినవారు. ప్రస్తుతం ఆమె తన భర్తతో కలిసి ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. తమిళనాడు రాజకీయాలకు, ఆమెకు ఏమాత్రం సంబంధం లేదు. అంతేకాదు... శ్రీపాద చిన్మయి కుటుంబానికి, దివ్య కుటుంబానికి సత్సంబంధాలు ఉన్నాయి.